: చిలుకా నగర్ లో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్... 30 మంది అనుమానితుల అరెస్ట్!
కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు మంచి ఫలితాలను ఇస్తున్నట్లున్నాయి. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సోదాలను హైదరాబాద్ పోలీసులు మరింత విస్తృతం చేశారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అర్ధరాత్రి నుంచి ఉప్పల్ పరిధిలోని చిలుకా నగర్ లో సోదాలు కొనసాగుతున్నాయి. మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి ఆధ్వర్యంలో దాదాపు 400 మంది పోలీసులు పాల్గొంటున్న ఈ సోదాల్లో ఇప్పటికే 30 మంది అనుమానితులు అరెస్టయ్యారు. 30కి పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.