: నందమూరి సినిమాల దండయాత్ర: కల్యాణ్ రామ్
దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర...నిజంగా దండయాత్రే... నందమూరి సినిమాల దండయాత్రేనని హీరో కల్యాణ్ రామ్ తెలిపారు. టెంపర్ ఆడియోలో ఆయన మాట్లాడుతూ, పూరీ మార్కు డైలాగుల్లో కనబడుతుందని అన్నారు. 'ఈ సినిమాలో పూరీ చాలా కష్టపడి మీ ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాను ఎత్తుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే'నని అన్నారు. పటాస్ లా, టెంపర్, లయన్ సూపర్ హిట్లవుతాయని కల్యాణ్ రామ్ అన్నారు.