: ఎడిటింగ్ రూంలో మీకంటే ఎక్కువ గొడవ చేశాను: ఛార్మీ


సినిమాలో కొన్ని సీన్స్ ఎడిటింగ్ రూంలో చూశానని నటి ఛార్మీ తెలిపింది. టెంపర్ ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, ఎడిటింగ్ రూంలో అభిమానుల కంటే ఎక్కువ గోల చేశానని చెప్పింది. సినిమా సూపర్ హిట్టవుతుందని చెప్పిన ఛార్మీ, సినిమాలో తారక్ అద్భుతంగా నటించాడని, సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలిపింది. సూపర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకుంటున్నారని నిర్మాత బండ్ల గణేష్ ను చార్మీ అభినందించింది. సినిమాలో కాజల్ అందంగా ఉందని ఛార్మీ చెప్పింది. సినిమాకోసం ఎదురు చూస్తున్నానని ఛార్మీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News