: సింహాలు గర్జిస్తాయి: దిల్ రాజు


తాత 'కొండవీటి సింహం', బాబాయ్ 'బొబ్బిలి సింహం', అన్నయ్య 'పటాస్' కాగా, తాజాగా తమ్ముడు 'టెంపర్' చూపిస్తున్నాడని నిర్మాత దిల్ రాజు తెలిపారు. టెంపర్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, పూరీ జగన్నాథ్ తాను తీసే ప్రతి హీరోలో ఓ యాటిట్యూడ్ చూస్తారని అన్నారు. అలా వారి యాటిట్యూడ్ ను బట్టి కథను రూపొందిస్తారని ఆయన తెలిపారు. ఈ మధ్యే తనకు సినిమాలో కొన్ని సీన్స్ ను పూరీ చూపించారని అన్నారు. ప్రతి సీన్ లోనూ ఎన్టీఆర్ ను కొత్తగా చూపించారని చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం అందించారని, ఆయనకు ఆల్ ది బెస్ట్ అని ఆయన గ్రీట్ చేశారు. పూరీ తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరికీ హిట్సిచ్చారని చెప్పిన ఆయన, ఎన్టీఆర్ కు కూడా హిట్టిస్తున్నారని అన్నారు. అలాగే ఎన్టీఆర్, కాజల్ ల హ్యాట్రిక్ ఫిల్మ్ వారి కాంబినేషన్ లాగే సూపర్ హిట్ గా నిలుస్తుందని ఆయన చెప్పారు. అనంతరం, ఆయన టీటైమ్ న్యూస్ కాలెండర్ ను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News