: మీ కంటే ముందు నేను సినిమా చూసేశాను: సుకుమార్


అభిమానులందరికంటే తాను అదృష్టవంతుడినని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెలిపారు. టెంపర్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, పూరీ గారు సినిమా కథను ఒక వారం రాస్తే హిట్టవుతుందని, అదే రెండు వారాలు కథ రాస్తే సూపర్ హిట్టవుతుందని చెప్పారు. అలాంటిది ఈ సినిమాకి నాలుగు వారాలు కథ రాశారని ఆయన తెలిపారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ తాను చూశానని చెప్పిన ఆయన, ఎన్టీఆర్ అద్భుతంగా, నిజాయతీగా, కసితో నటించారని అన్నారు. 'సినిమా సూపర్ హిట్' అని ఆయన ఘంటాపథంగా పేర్కొన్నారు. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను పూరీ కొత్తగా చూపించారని అన్నారు.

  • Loading...

More Telugu News