: బట్టతలతో విసిగిపోయారా? కొత్త వైద్యం అందుబాటులోకి రానుంది!


బట్టతల...అబ్బాయిలను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య. నిండా ఇరవైల్లోకి అబ్బాయిలు ప్రవేశించారో లేదో... అలా బట్టతల వచ్చేస్తోంది. దీంతో బట్టతల నివారణకు ఎన్నో వైద్యాలు అందుబాటులోకి వచ్చినా బాధితులకు పూర్తి సంతృప్తినివ్వలేకపోయాయి. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు మూలకణాలను ఉపయోగించి కొత్త వెంట్రులకను సృష్టించారు. ప్లూరీ పొటెంట్ మూల కణాలతో జట్టు పెరుగుదలను ప్రేరేపించే కొత్త చర్మ సంబంధిత బుడిపె కణాలను సృష్టించడం ద్వారా జుట్టును మొలిపిస్తారు. ఇది ఇప్పుడు వినియోగంలో ఉన్న చాలా వైద్య చికిత్సల కంటే మెరుగైనదని సాన్ ఫోర్డ్-బర్న్ హమ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ప్రొఫెసర్ అలెక్సీ టెర్స్ కిక్ తెలిపారు.

  • Loading...

More Telugu News