: శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలను స్వాధీనం చేసుకోండి: కేంద్రానికి ఏపీ లేఖ


తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తున్న కారణంగా, శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలను తక్షణం స్వాధీనం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణా జలాలను వినియోగించుకోవడాన్ని తెలంగాణ ప్రభుత్వం వివాదం చేస్తోందని, సమస్యను పరిష్కరించుకుందామని ఎంత ప్రయత్నించినప్పటికీ, ఘర్షణాత్మక వైఖరి వీడడం లేదని ఆరోపిస్తూ కేంద్రానికి ఏపీ ఫిర్యాదు చేసింది. సాగర్ కుడి కాల్వకు గేట్లు ఆపరేట్ చేస్తున్న సిబ్బంది తెలంగాణకు చెందిన వారు కావడంతో, ఏపీకి సకాలంలో నీటిని విడుదల చేయడం లేదని, దాని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ, కేంద్రానికి తెలిపింది. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News