: శిల్ప కళావేదికపై ప్రారంభమైన 'టెంపర్' ఆడియో వేడుక
జూనియర్ ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా రూపొందిన 'టెంపర్' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరుగుతోంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై రూపొందిన 'టెంపర్' సినిమాకు మ్యూజిక్ అనూప్ రూబెన్స్ అందించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. కాగా, గత కొంత కాలంగా పెద్ద హిట్లు లేని జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ లిద్దరూ 'టెంపర్' సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో కొన్ని రూపొందినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలివ్వలేదు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని లక్ష్యంతో వీరిద్దరూ కసిగా పనిచేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. కాగా, పాటలను యూట్యూబ్ లో రిలీజ్ చేసే కొత్త సంప్రదాయానికి పూరీ ఈ సినిమాతో తెరతీశారు.