: సౌదీలో మిషెల్ ఒబామా బురఖా వివాదం
సౌదీ అరేబియా పర్యటనలో మిషెల్ ఒబామా బురఖా ధరించకపోవడంతో అక్కడి టీవీ చానెల్ ఆమె ముఖాన్ని బ్లర్ చేసి ప్రచురించింది. దీంతో వివాదం రేగింది. సౌదీ అరేబియాలో మహిళల దుస్తులపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. దీంతో మిషెల్ ఒబామా సౌదీ పర్యటన సందర్భంగా దుస్తుల తీరును మార్చుకున్నారు. భారత పర్యటనలో పొట్టి గౌనులు ధరించిన మిషెల్ ఒబామా, సౌదీలో పొడవాటి గౌన్లు ధరించారు. పొడవాటి ప్యాంట్లు ధరించారు. అయినప్పటికీ ఆమె బురఖా ధరించలేదన్న కారణంగా సౌదీ అధికారిక ఛానెల్ లో ఆమె ముఖాన్ని బ్లర్ చేసి చూపించారు. దీంతో పెను వివాదం రేగింది. సౌదీ ఎంబసీ దీనిపై స్పందిస్తూ ఫేస్ బుక్ ప్రచారాలను నమ్మొద్దని, వాస్తవాలు చూడాలని ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన క్లిప్పింగుల్లో మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి ఉంది. అయితే ప్రత్యక్ష ప్రసారం చూసిన వాళ్లు అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. విదేశీయులకు వస్త్రధారణలో నిబంధనల సడలింపు ఉన్నప్పటికీ ఆమె ముఖం బ్లర్ చేయడంపై వివాదం రేగుతోంది.