: ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ను ఎందుకు తరలిస్తున్నారు?: జీవన్ రెడ్డి
హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని ఎందుకు తరలిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపనేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ, ఛాతీ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించడం దేనికి సంకేతమని నిలదీశారు. అవినీతిని సహించబోమని గప్పాలు కొడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక మాఫియా కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారికంగా ఇసుకను వినియోగించుకునే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమా? లేక రాచరికమా? అని ఆయన నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన విమర్శించారు.