: ఆంధ్రోళ్లను 'గో బ్యాక్' అని అనలేదు: నాయిని
ఆంధ్రా వాళ్లను గోబ్యాక్ అని తాము అనలేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు నేతలతోనే తగాదా తప్ప సామాన్య ప్రజలతో లేదని అన్నారు. అందుకే నాయకులను విమర్శించామే తప్ప, ప్రజలను కాదని ఆయన తెలిపారు. తెలంగాణలో బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు.