: బీసీసీఐని ప్రాధేయపడుతున్న విండీస్ క్రికెట్ బోర్డు
గతేడాది భారత టూర్ మధ్యలోనే విండీస్ జట్టు స్వదేశానికి మరలడం కరీబియన్ క్రికెట్ బోర్డును చిక్కుల్లో పడేసింది. నష్టపరిహారం చెల్లించాల్సిందేనని, లేని పక్షంలో, న్యాయపరమైన చర్యలు తప్పవంటూ బీసీసీఐ హెచ్చరించడం తెలిసిందే. దీంతో, ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) బీసీసీఐని ప్రాధేయపడుతోంది. తమను కోర్టుకీడ్చవద్దంటూ వేడుకుంటోంది. విండీస్ బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరాన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని బీసీసీఐకి సూచించారు. తాము ఇంతకుముందు రాసిన లేఖలను, అందులో పేర్కొన్న ప్రతిపాదనలను సరిగా పరిశీలించలేదని ఆయన వాపోయారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. గత సంవత్సరం విండీస్ జట్టు భారత్ తో వన్డే సిరీస్ జరుగుతుండగానే, అంతర్గత సమస్యలతో ఇంటి బాట పట్టింది.