: రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాలు తొలగించాల్సిందే... భారత్ హిందువులకు చెందినది: శివసేన


బీజేపీకి మరో తలనొప్పి! ఇప్పటికే పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిన కాషాయదళానికి ఇప్పుడు మిత్రపక్షం శివసేన చేసిన వ్యాఖ్యలు మరింత చిక్కులు తెచ్చిపెట్టేవే. సెక్యులర్, సోషలిస్ట్ పదాలను రాజ్యాంగం పీఠిక నుంచి తొలగించాలని శివసేన డిమాండ్ చేసింది. భారతదేశం హిందువులకు చెందినదని పేర్కొంది. పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలన్నది కోట్లాది భారతీయుల భావన అని స్పష్టం చేశారు. భారత్ లో అన్ని మతాల వారు ఉండవచ్చని, అయితే, హిందువులదే పైచేయిగా ఉండాలని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన ఓ అడ్వర్టైజ్ మెంట్లో రాజ్యాంగ పీఠిక నుంచి తీసుకున్న ఓ వ్యాఖ్యను పొందుపరచారు. అందులో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు మిస్సవడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ, సర్కారును, శివసేన తీరును తప్పుబట్టారు. భారత్ లౌకిక వాద దేశమని, హిందూ దేశం కాదని స్పష్టం చేశారు. సెక్యులర్ అన్న పదాన్ని ఏకపక్షంగా తొలగించే వీల్లేదని, అలాచేస్తే అది రాజ్యాంగానికి పాతర వేసే ప్రయత్నమేనని అన్నారు.

  • Loading...

More Telugu News