: 'ప్రజారాజ్యం' కంటే పెద్దతప్పు చేయొద్దు... చిరంజీవికి వర్మ సలహా
వివాదాస్పద ట్వీట్లతో సంచలనం రేపే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి ట్వీట్లతో వివాదం రేపారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 150వ సినిమాకు చిరంజీవే దర్శకత్వం వహించుకోవాలని సూచించాడు. అలా చేయని పక్షంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం కంటే పెద్ద తప్పుచేసినట్టవుతుందని పేర్కొన్నాడు. చిరంజీవికి దర్శకుల కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసని అన్నాడు. త్రివిక్రమ్, వినాయక్ వంటి వాళ్లతో 150వ సినిమా తీస్తే అదో మామూలు సినిమా అవుతుందని పేర్కొన్న వర్మ, చిరంజీవే దర్శకత్వం వహిస్తే మరో 'బాహుబలి' అవుతుందని అన్నారు.