: బాబు నోట 'జలయజ్ఞానికి పెద్దపీట' మాట
_3170.jpg)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం నడుస్తోందని, జలయజ్ఞం సాధ్యం కాదని ఆందోళన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వచ్చే బడ్జెట్లో జలయజ్ఞానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. హైదరాబాదులో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన జలయజ్ఞం ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదుల అనుసంధానం ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా చేపడతామని అన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానిస్తామని చెప్పారు. అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీరందిస్తామని ఆయన వెల్లడించారు.