: భారత్ తో పాక్ మంచి సంబంధాలు కోరుకుంటోంది: నవాజ్ షరీఫ్
తమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న దేశాలన్నింటితో పాకిస్థాన్ మంచి సంబంధాలు కోరుకుంటోందని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తాజాగా పేర్కొన్నారు. భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ సమావేశం సందర్భంగా, పాక్ కు భారత్ ముఖ్యమైన పొరుగు దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విడుదలైన అధికారిక పత్రికా ప్రకటనలో... ఇస్లామాబాద్, న్యూఢిల్లీ మధ్య ప్రస్తుతమున్న సంబంధాల పరిస్థిితిని షరీఫ్ కు బాసిత్ వివరించినట్టు పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల మధ్య జమ్ము కాశ్మీర్, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకోవడం కూడా ముఖ్యమని బాసిత్ సూచించారట.