: సూట్ పై పేరేంటి... ఉన్మాదిలా!: మోదీపై జైరాం విమర్శలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధరించిన ప్రత్యేక సూట్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు చేస్తున్నారు. ప్రధాని ధరించిన ఆ సూట్ పై 'నరేంద్ర దామోదర్ దాస్ మోదీ' అన్న పేరును చారల రూపంలో పొందుపరిచారు. "ఇది పూర్తిగా పిచ్చితనం. ఇలా చేయడం ఉన్మాదాన్ని ప్రతిబింబిస్తోంది" అని వ్యాఖ్యానించారు. ఒబామా తొలిరోజు పర్యటనలో ఢిల్లీలో ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో మోదీ పిన్ స్ట్రైప్స్ తో ఉన్న ఓ సూట్ ధరించారు. అయితే, అవి పిన్ స్ట్రైప్స్ కావని, తన పూర్తి పేరుతో ఉన్న అక్షరాలని తెలిసింది. సూట్ పై పేరు వెయ్యిసార్లు వచ్చేలా నేతలో రూపొందించారట. దాంతో, సోషల్ మీడియాలో ఆ సూట్ ఫొటో హల్ చల్ చేసింది. ఈ వ్యవహారం భారీ స్థాయిలో చర్చనీయాంశం అయింది. దాంతో స్పందించిన జైరాం పైవిధంగా అసహనం వ్యక్తం చేశారు.