: వైఎస్సార్సీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలస వస్తున్నారు: అచ్చెన్నాయుడు
వైఎస్సార్సీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి వలసలు వస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉనికిని కాపాడుకునేందుకే జగన్ దీక్ష చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నేడు భవన నిర్మాణ కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రూ.1.07 కోట్ల చెక్కులను కార్మికులకు అందించారు. కార్మికులు ఎక్కువగా ఉన్న చోట ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. అటు, మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల కోసం పనిచేసే దేవుళ్లను రాక్షసులు అడ్డుకున్నట్టుగా చంద్రబాబును జగన్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న జగన్ కు రాజకీయ పరిణతి లేదని అన్నారు.