: ఇదే ఆఖరు... ఇంకోసారి అలా మాట్లాడితే కఠిన చర్యలే: కేజ్రివాల్ కు ఈసీ హెచ్చరిక


తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే డబ్బు తీసుకొని 'ఆప్'కు ఓటు వేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మళ్ళీ అటువంటి వ్యాఖ్యలే చేయడంతో ఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకమైన అటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని కాస్త గట్టిగానే చెప్పింది. మరోసారి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేజ్రివాల్ కు ఇప్పటికే పలుమార్లు ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News