: జూన్ నాటికి ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్: సీఆర్డీఏ కమిషనర్
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని మాస్టర్ ప్లాన్ జూన్ నాటికల్లా సిద్ధమవుతుందని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. సింగపూర్ పర్యటన తర్వాత రాజధానిపై స్పష్టత వచ్చిందని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం 50 నుంచి వందేళ్లు కొనసాగుతుందని చెప్పారు. 50 నుంచి వందేళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని భూ సమీకరణ చేస్తున్నట్టు కమిషనర్ వివరించారు. ఈ నెలాఖరు నాటికి 10వేల ఎకరాల మేర భూసమీకరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఫిబ్రవరి 2, 4 తేదీల్లో సింగపూర్ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుందని చెప్పారు.