: బీజేపీ కార్యాలయానికి వెంకయ్య శంకుస్థాపన చేస్తే ప్రభుత్వం అడ్డుకోలేదు: బీవీ రాఘవులు


కృష్ణా నది కరకట్ట పక్కన బీజేపీ కార్యాలయానికి కొన్ని రోజుల కిందట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేయడంపై వివాదం రాజుకుంటోంది. శంకుస్థాపనను ఏపీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ఇతర పార్టీల నేతలు తమ కార్యాలయాలను అక్కడే నిర్మిస్తామంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. కానీ, బడాబాబులందరూ నిబంధనలు తుంగలో తొక్కి ఇలా చేస్తున్నారన్నారు. కృష్ణా కరకట్ట పక్కన అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని, అక్కడి రెండు వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం తీసుకోవాలని మీడియా ముందు కోరారు. అటు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్రాలు తమ వైఖరిని స్పష్టం చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేదిలేదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News