: సీఐ దంపతులపై నుంచి దూసుకెళ్లిన వాహనం... భార్య మృతి, సీఐకి గాయాలు


అనంతపురం జిల్లాలో రాత్రి ఘోరం జరిగింది. పొలం పనుల్లో బాగంగా రాత్రి దాకా పనులు చేసి కంది పంటకు కాపలాగా రోడ్డు పక్కగా నిద్రించిన సీఐ అర్జున్ నాయక్ దంపతులపై అర్థరాత్రి గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సీఐ గాయాలపాలవగా, ఆయన భార్య పద్మ (39) అక్కడికక్కడే మృత్యువాత పడింది. అనంతపురం జిల్లాలోని నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. కడప జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్ నాయక్, పొలం పనుల కోసం స్వస్థలం నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి తండాకు వచ్చారు. ఈ క్రమంలో నిన్న పగలంతా భార్యతో కలిసి పొలంలో వేసిన కంది పంట కోత, నూర్పిడిలో ఆయన పాల్గొన్నారు. రాత్రి పొద్దుపోయేదాకా పొలం వద్దే ఉన్న వారిద్దరూ రోడ్డు పక్కగా నిద్రించారు. అర్ధరాత్రి గుర్తు తెలియని ఓ వాహనం వారిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడ్డ సీఐని కదిరి ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News