: మరోసారి అపోలో ఆసుపత్రికి తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య


నిన్న స్వల్ప గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నేటి ఉదయం మరోసారి అపోలో ఆసుపత్రికి వచ్చారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఛాతీలో నొప్పి రావడంతో రాజయ్యను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు బీపీ, పల్స్ రేటు, షుగర్ లెవెల్స్ పెరిగినట్లు గుర్తించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.

  • Loading...

More Telugu News