: సెమీస్ లో సెరెనా... ఆస్ట్రేలియన్ టైటిల్ కు చేరువైన విలియమ్స్ సిస్టర్!
విలియమ్స్ సిస్టర్స్ లో ఒకరైన సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ చేరింది. తన సోదరి వీనస్ విలియమ్స్ క్వార్టర్ ఫైనల్ తోనే సరిపెట్టగా, సెరెనా మాత్రం క్వార్టర్స్ లో నెగ్గి సెమీస్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ 6-2, 6-2 తో సిబుల్కోవాను చిత్తు చేసింది. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్, మ్యాడిసన్ కీస్ చేతిలో పరాజయం పాలైంది.