: కూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై ఏసీపీ దాష్టీకం!
కోటి ఆశలతో మెట్టినింటికి వచ్చిన ఆడబిడ్డను కన్న కూతురితో సమానంగా చూసుకోవాల్సిన మామ విషం కక్కాడు. న్యూఢిల్లీ ఉత్తర మండలం ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కోడలిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా ఉంచే క్రమంలో ఆ ప్రబుద్దుడి పేరు కూడా పోలీసులు వెల్లడించలేదు. తన మామ బెదిరించి అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, నిందితుడు పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారిగా ఉండటంతో ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.