: అమెరికాను వీడని ‘మంచు’ ముప్పు... 4,700 విమాన సర్వీసులు రద్దు!
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను ముంచెత్తుతోంది. కొద్దిరోజులుగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న మంచు, నేడు పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ప్రభావం చూపుతోంది. మంచు తుపాను నేపథ్యంలో న్యూజెర్సీలో ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ నేడు కూడా కొనసాగుతోంది. బోస్టన్ లో ఆరు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఫిలడెల్పియా, కనెక్టికట్ లలోనూ మంచు తుపాను ప్రభావం అధికంగా ఉంది. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుందని ఆ దేశ వాతావరణ శాఖ చెబుతోంది. మంచు ప్రభావం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దేశవ్యాప్తంగా 4,700 విమాన సర్వీసులు రద్దయ్యాయి.