: అనంతలో స్వైన్ ఫ్లూ కలకలం... వెంటిలేటర్ పై బాలింత
తెలుగు రాష్ట్రాలను గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ తాజాగా అనంతపురం జిల్లాకూ పాకింది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో జిల్లాకు చెందిన ఓ మహిళ బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కడుపులోనే శిశువు చనిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ బాలింతకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డీటీ ఆసుపత్రి వైద్యులు స్వైన్ ఫ్లూ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.