: ప్రకాశం జిల్లాలో రోడ్ టెర్రర్: కాలిబూడిదైన వోల్వో బస్సు... ప్రయాణికులు సురక్షితం


ఏపీలో మరో ఘోర ప్రమాదం తప్పింది. నిండా ప్రయాణికులతో పరుగులు తీస్తున్న ఓ వోల్వో బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. మంటలకు బస్సు పూర్తిగా దహనం కాగా, ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాదు వస్తున్న వోల్వో బస్సు ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగల్లు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రయాణికులు చెప్పారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల్లో బస్సును కాల్చిబూడిద చేశాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బస్సు దిగగలిగినా, వారి సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ బస్సు తమిళనాడులోని పర్వీన్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సులో తరలిస్తున్న పేలుడు పదార్థాల కారణంగానే మంటలు చెలరేగాయని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News