: తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య డిశ్చార్జ్


అస్వస్థతతో ఆసుపత్రిపాలైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. బర్తరఫ్ మాట వినగానే ఎంతో వేదనకు గురయ్యానని తెలిపారు. గత ఐదురోజులుగా నిద్రలేదని, తీవ్ర ఆందోళన చెందానని వివరించారు. నాలుగైదేళ్లుగా హై బీపీ, షుగర్ తో బాధపడుతున్నానని, సరిగా నిద్రలేకపోవడంతో బీపీ పెరిగిందని తెలిపారు. రేపు ఉదయం మరోసారి ఆసుపత్రికి వస్తానని చెప్పారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని రాజయ్య డిమాండ్ చేశారు. కడిగిన ముత్యంలా బయటపడతానన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనకు తండ్రిలాంటి వారని పేర్కొన్నారు. ఛాతీలో నొప్పితో ఈ సాయంత్రం రాజయ్య హైదర్ గూడ అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News