: గణతంత్ర వేడుకల్లో పతకం అందుకున్న మరుసటి రోజే ఆర్మీ కల్నల్ మృతి


జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. త్రాల్ ప్రాంతంలో భద్రతా దళాలన లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మునీంద్రనాథ్ రాయ్ అనే ఆర్మీ కల్నల్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మునీంద్ర నాథ్ ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అటు, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. కాల్పులకు తెగబడింది హిజ్బుల్ ముజాహిదిన్ గ్రూపు అని తెలిసింది. కాగా, మునీంద్ర నాథ్ కు నిన్న ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో 'యుద్ధ సేవా' పతకాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారం అందుకున్న మరుసటి రోజు ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు విడవడం విషాదకరం.

  • Loading...

More Telugu News