: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు గుండెపోటు... అపోలో ఆసుపత్రికి తరలింపు


తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య హైదరాబాదులో గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. రక్తపోటు, షుగర్ లెవెల్స్ పెరిగినట్టు వైద్యులు తెలిపారు. గుండె ఎడమ వాల్వ్ పనితీరులో తేడాను గుర్తించినట్టు తెలుస్తోంది. ఆయనను 24 గంటలపాటు ఐసీయూలో అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విస్తరణకు బాధ్యుడిని చేస్తూ రాజయ్యను బర్తరఫ్ చేయడం తెలిసిందే. దళితుడన్న కారణంగానే ఆయన్ను బలిపశువును చేశారని తెలంగాణ సర్కారుపై పలువురు విమర్శనాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News