: 'ఐ' సినిమాతో తమిళనాట బాడీ బిల్డింగ్ కు పెరిగిన క్రేజ్


ఇటీవలే విడుదలైన 'ఐ' సినిమాలో హీరో విక్రమ్ బాడీబిల్డర్ గా కనిపిస్తాడు. ఆ సినిమా విడుదల అనంతరం తమిళనాడులో బాడీ బిల్డింగ్ పై క్రేజ్ పెరిగిపోయిందట. ఇప్పుడు అక్కడ భారీ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా, చెన్నైలో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కు హీరో విక్రమ్ తో పాటు 'ఐ' చిత్ర యూనిట్ కూడా హాజరైంది. ఈ పోటీలో విజేతగా నిలిచి, 'స్టీల్ మ్యాన్' బిరుదు సొంతం చేసుకున్న జయప్రకాశ్ అనే యువకుడికి విక్రమ్ చేతుల మీదుగా రూ.5 లక్షల ప్రథమ బహుమతి అందజేశారు.

  • Loading...

More Telugu News