: నల్గొండ జిల్లాలో ముగిసిన షర్మిల తొలిదశ పరామర్శ యాత్ర


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో నేటితో ముగిసింది. ఏడు రోజుల పాటు జరిగిన ఈ తొలిదశ యాత్రలో ఆమెకు అభిమానుల ఆదరణ లభించింది. వైఎస్ఆర్ ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేక ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఈ యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆరు నియోజకవర్గాల్లో 30 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. త్వరలో ఈ జిల్లాలో రెండో దశ యాత్ర చేపట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News