: భారత్ లో ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి అమెరికా సాయం
భారతదేశంలో ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చెందేందుకు తనవంతు సాయం చేసేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో అమెరికా వాణిజ్య కార్యదర్శి భేటీ అయ్యారు. ఆకర్షణీయ నగరాలు విశాఖ, అలహాబాద్, అజ్మీర్ అభివృద్ధిపై చర్చించారు. ఈ నగరాల అభివృద్ధికి సాయం అందించే విషయంపైనా మాట్లాడుకున్నారు. మూడు నగరాల అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్రం, అమెరికా ప్రతినిధులు ఉంటారు. మూడు నెలల్లోగా నగరాల అభివృద్ధికి టాస్క్ పోర్స్ ప్రతిపాదనలు చేయనుంది.