: ఆర్కే లక్ష్మణ్ కు ఇస్రో నివాళి... ట్విట్టర్లో 'మంగళయాన్' కార్టూన్


ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ మృతికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నివాళి తెలిపింది. ఆయన చివరగా 'మంగళయాన్' ప్రాజెక్టుపై గీసిన కార్టూన్ ను ట్విట్టర్లో పెట్టింది. లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన 'సామాన్యుడు' త్రివర్ణ పతాకం చేతబూని అంగారకుడి దిశగా అడుగులేస్తున్నట్టు ఆ కార్టూన్ లో కనిపిస్తుంది. ఈ లెజెండరీ కార్టూనిస్టు అనారోగ్యంతో సోమవారం సాయంత్రం పుణేలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. "దిగ్గజానికి నివాళి. ఆర్కే లక్ష్మణ్ రెండు వారాల క్రితం ఈ అద్భుతమైన కార్టూన్ ను కానుకగా పంపారు" అని ఇస్రో తన ట్వీట్ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News