: ప్రశ్నించే దమ్ము యువతలో తగ్గింది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయ నాయకులు చేస్తున్న తప్పులను నిలదీసి ప్రశ్నించే దమ్ము యువతలో తగ్గిందని జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజం పర్యటనలో ఉన్న ఆయన ఇంజినీరింగ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం ఒక్క తరం చేసిన తప్పుతో రాష్ట్రం రెండు ముక్కలు అయిందని ఆయన విమర్శించారు. యువత ప్రశ్నించక పోవడంవల్లే ఈ పరిస్థితి సంభవించిందని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఇంజినీరింగ్ విద్యార్థులతో కలసి పవన్ కల్యాణ్ 'స్వచ్ఛ భారత్'లో పాల్గొన్నారు.