: కేజ్రీవాల్ కు కిరణ్ బేడీ లీగల్ నోటీసులు


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ లీగల్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా 'ఆప్' పోస్టర్లలో తన ఫొటోను వాడుకున్నారని, పోస్టర్లు తొలగించాలని కోరారు. దీనిపై బీజేపీ మీడియా కన్వీనర్ ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ, "అవును, ఆమె కేజ్రీవాల్ కు నోటీసులు పంపారు. పోస్టర్ల తొలగింపుపై హామీ ఇవ్వాల్సిందిగా కోరారు" అని తెలిపారు. ఢిల్లీలో భారీ సంఖ్యలో తిరిగే ఆటోరిక్షాలపై ఈ పోస్టర్లను 'ఆప్' అంటించింది. సీఎంగా కేజ్రీవాల్ కావాలో, కిరణ్ బేడీ కావాలో తేల్చుకోవాలంటూ ఆ పోస్టర్లలో పేర్కొంది. కాగా, ఆ పోస్టర్లలో కేజ్రీవాల్ చిత్రం కింద 'నిజాయతీపరుడు' అని రాసి ఉండగా, కిరణ్ బేడీ చిత్రం కింద 'అవకాశవాది' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News