: హమ్మయ్య... ఊపిరి పీల్చుకున్న భారత్!
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒబామా పర్యటన ముగియడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. దీంతోపాటు ఆయన పర్యటన విజయవంతం కావడంతో మోదీ సర్కారు ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. కాగా, ఒబామా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరికీ ఇవ్వనంత రక్షణ ఏర్పాట్లు చేశారు. నిన్న రిపబ్లిక్ వేడుకల సందర్భంగా సుమారు 2 గంటల పాటు దాదాపు ఆరు బయట కూర్చున్న ఆయనకు ఏడంచెల భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 400 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి విమానాలు, హెలికాప్టర్లు తిరగకుండా నిషేధించారు. దీంతో, చండీఘడ్, న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రా, ప్యాంటు నగర్, గ్వాలియర్ తదితర ఎయిర్ పోర్టులను మూసివేశారు. ఢిల్లీని జల్లెడ పట్టిన పోలీసులు ఆయన తిరిగి వెళ్ళేవరకూ భారీ రక్షణ కల్పించారు.