: భారత్ పర్యటనకు రానున్న మరో దేశాధ్యక్షుడు
మరో రెండు వారాల్లో ఇంకో దేశాధ్యక్షుడు భారత పర్యటనకు రానున్నారు. సింగపూర్ దేశాధ్యక్షుడు టోనీ టాన్ కెంగ్ యామ్ ఫిబ్రవరి తొలివారంలో ఇండియా పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించేందుకు ఆయన ఢిల్లీని సందర్శించనున్నట్టు ప్రకటన వెలువడింది. ఆయన పర్యటన షెడ్యూల్ ను సింగపూర్ రవాణాశాఖ మంత్రి విడుదల చేశారు. కాగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన నేటితో ముగిసిన సంగతి తెలిసిందే.