: భారత్ కు 'బై' చెప్పిన ఒబామా దంపతులు ... సౌదీ పయనం


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన ముగిసింది. ఈ మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని పాలం ఎయిర్ బేస్ నుంచి సౌదీ పయనమయ్యారు. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ, అధికారులు వీడ్కోలు పలికారు. కాగా, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం లోపలికి ప్రవేశించే ముందు ఒబామా, ఆయన అర్ధాంగి మిషెల్ భారత వర్గాలకు సంప్రదాయబద్ధంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపి, నిష్క్రమించారు. ఒబామా ఇటీవల మరణించిన సౌదీ రాజు అంత్యక్రియల్లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News