: గర్ల్ ఫ్రెండ్ వస్తుందనుకొని వెళితే... బంధువులు వచ్చి బాదారు!
ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిని కలుద్దామని వెళితే, ఆ అమ్మాయి బంధువులు వచ్చి చితక్కొట్టిన ఘటన విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణాజిల్లా గొల్లపూడికి చెందిన శివ దుర్గాశ్రీనివాస్ గత కొంతకాలంగా ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ నేడు విజయవాడ క్లబ్ సమీపంలోని 'ఎడ్వంచర్' వద్ద కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ అక్కడికి వెళ్లి వేచి చూస్తుండగా, యువతి బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు వచ్చి అతడిని సమీప పొలాల్లోకి తీసుకువెళ్ళారు. అక్కడ అతడిని చితకబాది పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తెలిపారు.