: ఆర్.కె.లక్ష్మణ్ స్మారకార్థం త్వరలో విగ్రహం ఏర్పాటు
ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ స్మారకార్థం త్వరలో విగ్రహం ఏర్పాటు కాబోతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ప్రకటన చేశారు. "లక్ష్మణ్ కేవలం కార్టూనిస్టు మాత్రమే కాదు. తన కార్టూన్స్ ద్వారా భవిష్యత్ ప్రభుత్వాలకు కూడా ప్రేరణ కల్పిస్తారు. ప్రస్తుతం ఆయన లేరు. కానీ, తాను క్రియేట్ చేసిన 'సామాన్యుడి' రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు" అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో ఆయనకు నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.