: మోదీ కేబినెట్ లో మహిళా మంత్రులే బెటరట... కేటినెట్ భేటీలకు రెగ్యులర్ హాజరు!


ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో మహిళా మంత్రులే మెరుగైన పనితీరుతో దూసుకెళుతున్నారు. విధాన నిర్ణయాల్లోనే కాక కేబినెట్ భేటీలకు హాజరులోనూ పురుషుల కంటే మహిళా మంత్రులు ఓ మెట్టు పైనే ఉన్నారు. మోదీ కేబినెట్ లో బీజేపీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఉమా భారతి, మేనకా గాంధీ, నజ్మా హెప్తుల్లాలతో పాటు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి తదితర మహిళా నేతలున్నారు. మోదీ నిర్వహిస్తున్న కేబినెట్ భేటీలకు ఉమా భారతి, స్మృతి ఇరానీ వంద శాతం హాజరు నమోదు చేశారు. నజ్మా హెప్తుల్లా (93.10 శాతం), మేనకా గాందీ (89.66 శాతం) హాజరును సాధించారు. ఇక పురుషుల విభాగంలో రాధా మోహన్ సింగ్, అనంత్ కుమార్ లు(96.55 శాతం) హాజరును మాత్రమే నమోదు చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారట. ఇక మోదీ కేబినెట్ లోని కీలక మంత్రి వెంకయ్యనాయుడు 72.44 శాతం హాజరునే నమోదు చేయగలిగారు.

  • Loading...

More Telugu News