: ఒబామా తాజ్ మహల్ సందర్శన రద్దుపై అఖిలేశ్ నిరాశ


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజ్ మహల్ సందర్శన రద్దు కావడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నిరాశ వ్యక్తం చేశారు. "ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశాన్ని కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం" అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి కార్యాలయంలో ఒబామాకు ఇచ్చిన విందుకు అఖిలేశ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ముందు షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం ఒబామా ఆగ్రా వెళ్లాల్సి ఉంది. అయితే గతవారం చనిపోయిన సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా అంత్యక్రియలకు ఆయన వెళ్లనుండటంతో ఇక్కడి సందర్శన క్యాన్సిల్ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News