: ఫేస్ బుక్, వాట్స్ యాప్ సేవలకు అరగంట అంతరాయం
నేటి మధ్యాహ్నం సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయాయి. ఈ రెండింటితో పాటు 'ఇన్‌స్టాగ్రామ్’ కూడా ఆగిపోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడం సాధ్యం కాలేదు. పోస్టింగ్స్ చూడటం కూడా ఎవరికీ కుదరలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి సుమారు అరగంటకు పైగా కొనసాగింది. చివరకు సమస్యను పరిష్కరించి సేవలు ప్రారంభించినట్టు ఫేస్ బుక్, వాట్స్ యాప్ లు తెలిపాయి. అంతరాయానికి చింతిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాగా, ఈ అరగంట వ్యవధిలో ఫేస్ బుక్ లేని ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయం నెటిజన్లకు తెలిసి వచ్చింది.