: పొట్టి జుట్టే కొంపముంచిందంటూ భోరుమన్న 'మిస్ జమైకా'


తనకున్న పొట్టి జుట్టు వల్లే విశ్వసుందరి కిరీటానికి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చిందని జమైకా సుందరి కాచి ఫెన్నెల్ బాధపడుతోంది. నిన్న జరిగిన మిస్ యూనివర్స్ 2015 పోటీలలో టాప్-5 లో నిలిచిన ఫెన్నెల్ చివరగా అడిగిన ప్రశ్నకు మిగతా వారితో పోలిస్తే మెరుగైన సమాధానాన్ని ఇచ్చింది. అయితే, హాలీవుడ్ సుందరి హాలే బెర్రీ తరహా హెయిర్ స్టైల్ ఆమె కొంప ముంచింది. దీంతో, ఆమె 5వ స్థానానికే పరిమితం అయింది. కిరీటం గెలవడానికి కావాల్సిన అర్హతలను న్యాయనిర్ణేతలు ముందుగా చెప్పలేదని ఫెన్నెల్ తీవ్ర విమర్శలు చేసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు ఫెన్నెల్ గెలుస్తుందని ఊహించగా, ఆఖరిమెట్టులో ఆమె బోల్తా పడగా, 'మిస్ కొలంబియా' పౌలినా వెగా కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News