: ప.గోదావరి జిల్లాలో మరోమారు అధికారులు, సిబ్బంది మధ్య బిగ్ ఫైట్


పశ్చిమగోదావరి జిల్లాలో మరోమారు ఉన్నతాధికారులు, సిబ్బంది మధ్య వివాదం రాజుకుంది. జిల్లా కలెక్టర్ భాస్కర్ తీరుకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు 'వర్క్ టూ రూల్' పాటిస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. మొన్నటికి మొన్న జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ను కూడా బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. నాడు రెవెన్యూ ఉద్యోగులు కేబినెట్ మంత్రుల వద్దకూ ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మంత్రుల రాయబారంతో సమసిన వివాదం నెల తిరక్కుండానే తిరిగి రాజుకుంది.

  • Loading...

More Telugu News