: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి రఫెల్ నాదల్ ఔట్... క్వార్టర్స్ లో ఓటమి


ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచనాలు నమోదవుతున్నాయి. ఆదిలోనే పరాజయం పాలైన రోజర్ ఫెదరర్ ఇప్పటికే తప్పుకోగా, నేటి ఉదయం రఫెల్ నాదల్ కూడా ప్రతిష్ఠాత్మక టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మెల్ బోర్న్ లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బెర్డిచ్ చేతిలో నాదల్ ఓటమి చవిచూశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన నాదల్ ను 6-2, 6-0, 7-6(7-5) స్కోరుతో బెర్డిచ్ మట్టికరిపించాడు. బెర్డిచ్ మెరుపుదాడికి తట్టుకోలేకపోయి చతికిలబడిన నాదల్ , టోర్నీ నుంచి భారంగానే నిష్క్రమించాడు. తొలి రెండు సెట్లను అతి సునాయాసంగా నెగ్గిన బెర్డిచ్ కు మూడో సెట్ లో నాదల్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. టై బ్రేక్ కు దారి తీసిన ఈ సెట్ లో బెర్డిచ్ చివరికంటూ పోరాడి నాదల్ పై చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. నాదల్ పై సాధించిన విజయంతో బెర్డిచ్ రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ లోకి దూసుకెళ్లాడు.

  • Loading...

More Telugu News