: టీటీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారంటున్న కూకట్ పల్లి ఎంఎల్ఏ


తెలంగాణలో తెలుగుదేశం ఎంఎల్ఏలు అందరూ టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారని కూకట్ పల్లి ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు అంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లోకేష్ ను కలసిన ఆయన తదుపరి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నానని వస్తున్న వార్తలపై లోకేష్ వివరణ కోరారని తెలిపారు. పార్టీని వీడే విషయమై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసినట్టు వివరించారు. దాదాపు అందరు ఎంఎల్ఏలు టీఆర్ఎస్ నేతలతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేస్తే టీఆర్ఎస్ లో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News