: రైతుబజార్ మార్గంలో మద్యం దుకాణమా?: మార్చేయండన్న మంత్రి పరిటాల సునీత


ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత నేటి ఉదయం అనంతపురం రైతుబజార్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబజార్ లోని స్థితిగతులతో పాటు రైతుబాజర్ కు దారి తీసే రోడ్డును కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో రైతుబజార్ కు వెళ్లే దారిలో ఓ మద్యం దుకాణం కనిపించింది. దీంతో ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేసిన ఆమె, రైతుబజార్ కు వెళ్లే దారిలో మద్యం దుకాణం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. అంతేకాక తక్షణమే సదరు మద్యం దుకాణాన్ని అక్కడినుంచి తరలించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News